ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే నందిగామ మున్సిపల్ కమిషనర్ హేమమాలిని దగ్గరుండి పట్టణంలో వివిధ రాజకీయ పార్టీల కు సంబంధించిన బ్యానర్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషన్ దగ్గరుండి మున్సిపల్ సిబ్బంది ద్వారా వివిధ రాజకీయ పార్టీల కు సంబంధించిన బ్యానర్లను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ ఈ రోజు నాలుగు గంటల నుండి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు ఫోటోలు తొలగించామని నందిగామ అర్బన్ కు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారిగా సురేష్ నియమించారని నందిగామ అర్బన్ కు సంబంధించి ఎటువంటి కంప్లైంట్లు చేయాలనుకున్న పురపాలక సంఘ అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నామ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ప్రసాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నామ్స్ ప్రకారం చర్యలు…
70
previous post