Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Film ‘ఒసేయ్ అరుంధతి’ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్…

‘ఒసేయ్ అరుంధతి’ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్…

by Prakash
Osey Arundhati

‘ఒసేయ్ అరుంధతి’ (Osey Arundhati) :

వెన్నెల కిషోర్, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’(Osey Arundhati) పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోన్న ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్. వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా …. చిత్ర నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ ‘‘హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలుఅరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు.

నటీనటులు:

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, పృథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు

సాంకేతిక వర్గం:

నిర్మాత- గూడూరు ప్రణయ్ రెడ్డి, దర్శకత్వం – విక్రాంత్ కుమార్, సినిమాటోగ్రఫీ – సాయి చైతన్య మాటేటి, మ్యూజిక్ – సునీల్ కశ్యప్, ఎడిటర్ – మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ – ఎన్ మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ – వాసు.

మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో …
ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.
కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్. చేతబడులు, క్షుద్ర పూజలు, …
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026383
Total views : 150344

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.