కడప జిల్లా… జమ్మలమడుగు లోని బిజెపి కార్యాలయంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి శాసనసభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి (Adinarayana reddy) విలేకరుల సమావేశం నిర్వహించి వైకాపా నాయకులపై నిప్పులు చేరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైకాపా నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. జగన్ పై జరిగిన ప్రతి దాడిని తనపై ఆరోపణలు చేశారని ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను వెనకేసుకువస్తు అన్యాయాలకు వంతపడుతున్నారని వివరించారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు, హెల్త్ క్యాంపులు తాను చేశానని, ఈ నాయకుడు ఏ అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తన సొంత బావమరిది సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేత అవినాష్ రెడ్డిని గెలిపిస్తాను అనడం హాస్య స్పందనముగా ఉందన్నారు. తమ సపోర్ట్ లేకుండా వార్డులలో కూడా తిరగలేని వ్యక్తి వైకాపాను గెలిపిస్తాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూర్యనారాయణ రెడ్డి కోసం తాము అనేక త్యాగాలు చేశామని ప్రస్తుతం ఆయన తమ నాశనం కోరుతున్నాడని ఇది సరైన పద్ధతి కాదని సూర్యనారాయణ రెడ్డి పై నిప్పులు చేరిగారు. అమిత్ షా జమ్మలమడుగు నియోజవర్గానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అన్నారు. ఈనెల 25వ తేదీన జమ్మలమడుగులో జరిగిన ర్యాలీ సక్సెస్ అయిందని ఈ సక్సెస్ తో తన గెలుపు ఖరారు అయినట్టేనని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…