జగన్ సిఎం అయ్యాక విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు..

amarnadh reddy

Advertisements

&NewLine;<p>జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period; పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో కరపత్రాలను ఆయన విడుదల చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; విద్యా వ్యవస్థను ఏ విధంగా బ్రష్టు పట్టించారనే విషయంపై యువతకు&comma; విద్యార్థులకు అవగాహన కల్పించడమే విద్యార్థి మేలుకో… భవిష్యత్ కాపాడుకో… కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు&period; తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు&period; రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి రాష్ట్రంలో సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు&period; అనేక కారణాలు చెప్పి సుమారు 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి దూరం చేశారన్నారు&period; ఇక ఇప్పటివరకు ఫీజు బకాయిలు చెల్లించలేదని పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు&period; దేశం బాగుపడాలంటే విద్యార్థులతోనే సాధ్యమవుతుందని విద్యావ్యవస్థ బాగుండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని విద్యార్థులందరూ మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్