చైనాలో వైరస్ పై ఎయిమ్స్ వైద్యుడి క్లారిటీ

AIIMS doctor's clarity on virus in China

Advertisements

&NewLine;<p>చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు&period; చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని&comma; కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి à°¡à°¾&period; ఎస్‌కే కాబ్రా భరోసా ఇచ్చారు&period; ఇటీవల కాలంలో చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో నిమోనియా తరహా శ్వాసకోశ వ్యాధి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్న విషయం తెలిసిందే&period; ఇది కరోనా సంక్షోభం లాంటి పరిస్థితికి దారి తీస్తుందన్న ఆందోళన నడుమ à°¡à°¾&period;ఎస్‌కే కాబ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి&period; అక్టోబర్&comma; నవంబర్ కాలంలో చైనాలో అకస్మాత్తుగా చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి కేసులు పెరిగాయన్న వార్తలు వస్తున్నాయి&period; ఈ కేసుల్లో మైకోప్లాస్మా కనిపించింది కానీ కొత్త&comma; అసాధారణ వైరస్‌లు ఏవీ బయటపడలేదు&period; కొత్త వ్యాధికారక జీవి వచ్చిందనేందుకు సంకేతాలేవీ లేవు&period; మరో కొవిడ్ తరహా సంక్షోభం వస్తుందని చెప్పేందుకు ప్రస్తుతం అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు&period; చలికాలంలో కనిపించే సాధారణ వైరస్‌లే చైనా కేసుల్లో బయటపడుతున్నాయని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.