ఆల్ రౌండర్ ఇమాద్ రిటైర్మెంట్‌..!

All-rounder Imad retires

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు&period; ఈ మేరకు శుక్రవారం తన రిటైర్మెంట్‌ను &OpenCurlyQuote;ఎక్స్’ వేదికగా ప్రకటించాడు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote; ఈ మధ్య నా అంతర్జాతీయ క్రికెట్ గురించి ఆలోచించుకున్నాను&period; వీడ్కోలు పలికేందుకు ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాను&period; వన్డే&comma; టీ20 ఫార్మాట్‌లో ఆడిన 121 మ్యాచ్‌లలో ప్రతి ఒక్కటి నా కలలను సాకారం చేశాయి&period; పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌లు&comma; నాయకత్వంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది&period; ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటున్నాను&period; పాక్ జట్టు రాణించడం కోసం నేను ఎదురు చూస్తుంటాను’’ ఎక్స్‌లో ఇమాద్ రాసుకొచ్చాడు&period; పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నిజంగా గౌరవంగా ఉందని&comma; ఏళ్లపాటు మద్దతు ఇచ్చిన పీసీబీకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు&period; అయితే అంతర్జాతీయేతర ఆటగాడిగా తన క్రికెట్ కెరియర్‌పై దృష్టి సారిస్తానని ఇమాద్ చెప్పాడు&period; కాగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ఇమాద్ 55 వన్డేల్లో 42&period;86 సగటుతో 986 పరుగులు చేశాడు&period; లెఫ్ట్ హ్యాండ్ స్పిన్‌తో 44 వికెట్లు కూడా పడగొట్టాడు&period; ఇక 66 టీ20ల్లో 486 పరుగులు&comma; 65 వికెట్లు తీశాడు&period; కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌పై ఆడిన టీ20 చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా ఉంది&period; కాగా మే 2015లో జింబాబ్‌పై టీ20 మ్యాచ్‌తో ఇమాద్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..