పల్నాడు జిల్లా.. ఈనెల 24న నామినేషన్ వేయబోతున్నాను అందరూ ఆశీర్వదించండి. రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవబోతున్నాం. సత్తెనపల్లిలో 20వేల 800 పైచిలుకు ఓట్లతో గతంలో గెలిచాను. ఈసారి సత్తెనపల్లిలో గత మెజారిటీ కన్న ఒక్క ఓటు తగ్గిన నైతికంగా ఓడిపోయినట్లే.. ఐదు సంవత్సరాలు చితశుద్ధిగా పరిపాలన చేశాము. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో సత్తనపల్లిలో మూడోసారి టికెట్ పొంది పోటీ చేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి కుంపటి ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేవని ఒకసారి నిరూపితమైనది. మరోసారి ప్రజలు కూటమిని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. పార్టీ మారే వ్యక్తులకు పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు మధ్య పోరాటం నా మీద అనిల్ కుమార్ మీద పోటీ చేసే వ్యక్తులు పార్టీలు మారిన వ్యక్తులు జెండాలు మార్చిన వ్యక్తులు బిజెపి టిడిపి జనసేన కూటమిపక్షంగా ఏర్పడి మా మీద పోటీ చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతోను పొత్తు లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చర్చలు జరుపుతాము. నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీతోను సంబంధాలు లేకుండా పోటీ చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి