ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో రోడ్ షో, ఈనెల 28న నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ ఉంటుందని బిజెపి అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి తెలిపారు. అమిత్ షా.. రోడ్ షో లో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, కన్వీనర్ దూడల బిక్షం పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో ప్రచారం పూర్తయిందని, కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉందని చల్లమల్ల అన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా… ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని… ఈసారి మునుగోడు గడ్డపై కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని చల్లమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడులో అమిత్ షా రోడ్ షో….
86
previous post