Anantapur District :
రాష్ట్రంలో నిరంకుశ పాలన, విధ్వంసకర పాలన, రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కోరుకున్నాడని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గుమ్మగట్ట మండలం లో తాళ్లకేర గ్రామంలో మనకోసం మన శీనన్న అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. వైసిపి నుండి టీడీపీ లోకి 29 కుటుంబాలు చేరారు. ప్రజలు నిరాజనం పలుకుతూ హారతితో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో రాయదుర్గం అభివృద్ధి కొరకు ఎన్నో రకాల అభివృద్ధి పనులు అందిస్తానని మాట ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు .ప్రస్తుత వైసిపి ప్రభుత్వం లో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోలేదని కాలవ విమర్శించారు. టిడిపి హయాంలోనే ప్రజలకు ఎంతో అభివృద్ధి లబ్ది చేకూర్చామని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మెట్టు గోవింద్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారాలను పెంచుకునేందుకు కృషి చేస్తాడని ప్రజలకు ఏమి చేయలేని అసమర్థులని ఎద్దేవా చేశారు.
వైసిపి సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఏపీ ఐ ఐ సి చైర్మన్ ఉన్నప్పుడు రాయదుర్గం అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేదని ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. రాయదుర్గం ఎమ్మెల్యేగా కాలువ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టానని ఎన్నో వేలకోట్ల తో తాగునీటి సమస్య, ప్రజా సమస్య తీర్చామని ప్రజలకు ఇటువంటి కష్టం వచ్చిన టిడిపి తరఫున అండగా ఉండి నిలబడి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రాయదుర్గంలో అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని గెలిపించాలని చుట్టం చూపుగా వచ్చి వెళ్లే అసమర్థులని తరిమికొట్టాలని తెలిపారు. వైసీపీ నాయకులు ఇప్పటికే రాయదుర్గంలో 2800 దాకా టిడిపిలో చేరారన్నారు. అభివృద్ధిని అక్షించే వైసిపి నాయకులు టిడిపిలో చేరుటకు రాగలిగితే తాను స్వచ్ఛందంగా ఆహ్వానిస్తానన్నారు. టిడిపి నాయకులపై బెదిరింపులకు విమర్శలకు పాల్పడ్డ వైసిపి నాయకులకు తాము అధికారంలో రాగానే వడ్డీ తో సహా చెల్లిస్తామని బదులిచ్చారు.