పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మేనిఫెస్టో ప్రెస్ మీట్ నిర్వహించిన యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasarao) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేలా తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తయారు చేశారని కొనియాడారు. 200 వందల రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని 2019 ఎలక్షన్ కు ముందు పెన్షన్ 3000 చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ కు 3000 పెన్షన్ చేయడానికీ సంవత్సరానికి ₹250 చొప్పున ఐదు సంవత్సరాలు పట్టిందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అలాగే 2024 ఎలక్షన్ మేనిఫెస్టో హామీలో కూడా 3000 పెన్షన్ దశలవారీగా 3500 చేస్తానని జగన్ అన్నారని అంటే రెండు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు చొప్పున అధికారంలోకి వస్తే ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది జగన్ నీకు 3500 పెన్షన్ చేయడానికి అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే 3000 పెన్షన్ ను ఏప్రిల్ నెల నుంచి 3500 ఇస్తామని అన్నారు. వ్యవస్థలను కుటుంబ సభ్యులను గౌరవించని జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏం గౌరవిస్తారని అన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా జులై 1 నుంచి 5 రోజుల పాటు నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పలు కీలక ప్రాజెక్టులకు…
- పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని…
- అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.ఏరువాక పున్నమిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల…




Total views : 181002