ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు 26.12.23 మంగళవారం ఉదయం 11 గంటలకు బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడుదాo ఆంధ్ర అనే కార్యక్రమం మంచి స్ఫూర్తితో కూడిన క్రీడాకారులకు మంచి నైపుణ్యం అందిస్తుందని కలెక్టర్ అన్నారు. మనం ఈ బిజీ కాలంలో మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటామని, అలాంటి టైంలో ప్రతిరోజు ఏదో ఒక సమయం కేటాయించి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా క్రీడలతో మానసిక ఉల్లాసం పొందచ్చని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా రాష్ట్రవ్యాప్తంగా గుంటూరులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ప్రతి ఒక్క క్రీడాకారుడు, విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ముఖ్య మంత్రి ఆలోచన ధోరణికి అద్ధం పడుతుందని, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు లాప్టాప్లు సెల్ ఫోన్లతో బిజీ లైఫ్ లో ఉన్నారని గమనించి శారీరకంగా అందరూ కష్టపడితే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఈ అవకాశాన్ని స్కూలు, కాలేజీ విద్యార్థులు, విద్యార్థినిలు, యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం….
66
previous post