పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన షాది ఖానాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్దేవరాయలు , ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అతిధులకు స్థానిక నాయకులు , కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాసు , ఎంపీ లావు కలసి షాది ఖానాను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలనాడు జిల్లాలో మొట్టమొదటి ఏసి షాదీ ఖానాను దాచేపల్లిలో నిర్మించామని వారు తెలిపారు. ముస్లింల దశాబ్దాల కల అయినా షాది ఖానా ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లిని మున్సిపాలిటీ చేశామని , దాచేపల్లి కి ప్రధాన సమస్య అయిన కాటేరు వాగు సమస్యని పరిష్కరించామని వారు తెలిపారు. గతంలో టిడిపి హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయలేని పని ఎమ్మెల్యే అయిన నేను చేసి చూపించానని వారు తెలిపారు. 16 కోట్ల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు పథకాన్ని తెచ్చామని వారు తెలిపారు. పార్టీలకి కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వారు తెలిపారు.
దాచేపల్లి లో నూతనంగా ప్రారంభమైన షాది ఖానా…
56
previous post