ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్‌గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తానంటూ ఆయన పేషీకి మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. పవన్‌ను చంపేస్తానంటూ అతను బెదిరింపులకు దిగాడు. ఉప ముఖ్యమంత్రిని అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ పలు మెసేజ్‌లు పంపించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బెదిరింపులకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియగా.. ఆమె వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. నిందితుడి ఫోన్ నంబర్ సహా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే అగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడని, పలు మెసేజ్‌లు పంపించాడని హోంమంత్రి అనితకు డీజీపీ తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని అనిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడి కాల్స్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ సిగ్నల్స్ విజయవాడ లబ్బిపేట నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ నంబర్ మల్లికార్జున్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్లికార్జున్ ఎవరు, ఎందుకు బెదిరింపులకు దిగాడు, అతని వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరు చేప్తే చేశాడు వంటి విషయాలు విచారణలో తెలియనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి