పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆడపిల్లలను రక్షించాలి.. భ్రూణ హత్యలను నిర్మూలిద్దాం అనే నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ పేరుతో 2 కే రన్ నిర్వహించారు. ఈ 2కే రన్ లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో దిక్కూ, మొక్కూ లేని దిశ చట్టంతో ఒక్క ఆడ బిడ్డకూ న్యాయం జరగలేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అరాచకాలతో సాగాయని విమర్శించారు.
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవటానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాదిమంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని నిమ్మల ప్రశ్నించారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి