ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. కడప లోక్సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.