ఏపీ కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, వారి రిమోట్ ఆయన వద్దే ఉందని ఆరోపించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి తన సోదరి షర్మిల పోటీ చేస్తుండడంపై తనకు ఎలాంటి బాధా లేదన్న జగన్.. ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని బాధగా ఉందని చెప్పారు. తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో తన తండ్రి వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్‌కు షర్మిల పనిచేస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తన పోరాటం చంద్రబాబుతో మాత్రమే కాదని, కాంగ్రెస్, బీజేపీతో కూడానని జగన్ వివరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
- అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని…
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.