త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. పాదయాత్రకు రావాలని, తన సంగతేంటో.. కథ ఏంటో తేలుద్దని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా 2027 నుంచి తాను పాదయాత్ర చేస్తానని, ఈసారి ఎన్నికల్లో విజయం ఖాయమని జగన్ ప్రకటించారు. అంతేకాదు చంద్రబాబు పాలనపై ఆయన విమర్శలు కురిపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచే ఈ విధమైన వార్నింగులు వస్తుంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎట్లుందో చూడాలని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా ప్రజా స్వామ్యంలో పాదయాత్రలు చేసుకోవచ్చని, ఎవరికీ అడ్డుకునే హక్కు లేదని చెబుతున్నారు. మరి జగన్ పాదయాత్ర చేసిన తర్వాత పరిస్థితి ఏంటనేది చూడాలి.