74
శ్రీకాకుళం జిల్లా.. రాజాం లో అంగన్వాడీ లు కదం తొక్కారు. ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పండగ పూట తమను పస్తులు ఉంచకుండా న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి తమకు 11,500 జీతం ఇస్తే ఏ విధంగా బతికేది అని ప్రశ్నించారు.