అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ళను అంగన్వాడీలు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏలూరులోని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటిని అంగన్వాడి మహిళలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లను ఏర్పాటు చేసి అంగన్వాడీ మహిళలను అడ్డుకున్నారు. గత 16 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలపై సమ్మె చేపట్టిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని. రెండుసార్లు చర్చిలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఆళ్ల నాని ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..
68
previous post