జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan))కు హరిరామ జోగయ్య(Harirama Jogaiah) మరో సంచలన లేఖ రాశారు. తన సలహాలు పవన్‌కు నచ్చినట్లు లేవన్నారు. పవన్ లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యమని జోగయ్య స్పష్టం చేశారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్‌ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఎంటో చెప్పాలని కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి జోగయ్య అన్నారు.
ఇది చదవండి: అనపర్తి లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
తనను వైసీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిత్రులెవరో శత్రువులు ఎవరో పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీ వీరుడంటూ పవన్‌పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కు ఇష్టమున్నా లేక పోయినా అయన వెంటే ఉంటా అన్నారు. పవన్ కల్యాణ్‌ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తా అన్నారు. చచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని హరిరామ జోగయ్య తేల్చి చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి