Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh వైసీపీ పార్టీలోకి భారీ చేరికలు…

వైసీపీ పార్టీలోకి భారీ చేరికలు…

by Prakash
YCP Party

YCP Party :

వైసీపీ తన జోరును చూపిస్తోంది. వైసీపీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గంలోని కంచిలి మండలంలో ఎన్ఎం పురం గ్రామం టిడిపికి చెందిన 70 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శుక్రవారం నాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఇచ్చాపురం వైసిపి అభ్యర్థిని పిరియ విజయ సాయిరాజ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ వైసీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన చూసి వైసీపీలో చేరిన టిడిపి కుటుంబాలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎన్నడు లేని అభివృద్ధిని సాధించిందని, మరలా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా వైసిపి అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీలోకి చేరికలు సందర్భంగా గ్రామానికి విచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ పీరియా విజయ సాయిరాజ్ కు గ్రామస్తులు పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు.


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

019445
Total views : 90729

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.