ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రిమాండ్‌..

Advertisements

<p>ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి 14 రోజుల రిమాండ్‌ విధించారు ఏసీబీ న్యాయమూర్తి&period; ఈ నెల 21 వరకు ఆమెకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు&period; దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు&period; ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు&period; తాడేపల్లి&comma; ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి&period; ఆంతో ఆమెను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్&ZeroWidthSpace; విధించారు&period; అనంతరం ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు&period;<&sol;p>&NewLine;<p>శాంతికి సంబంధించి విజయవాడ&comma; తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు&period; విలువైన డాక్యుమెంట్స్‌&comma; బ్యాంక్ లాకర్లు&comma; నగదు&comma; ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు&period; విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్&comma; తాడేపల్లి కుంచనపల్లిలో జీ&plus;2 భవనం&comma; 770 గ్రాముల బంగారు నగలు&comma; 3 కిలోల వెండి&comma; అలాగే 1&period;15 లక్షల నగదు&comma; బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల రూపాయలను గుర్తించారు&period; అంతేకాకుండా వోక్స్‌వ్యాగన్ పోలో కారు&comma; ఓ బైక్‌ను కూడా గుర్తించారు&period; అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్‌లో ఉన్న శాంతి&comma; ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది&period; ఐతే గత ప్రభుత్వం అండతో శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులతో సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి&period; దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.