సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సైబర్ నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>అమరావతిలో సైబర్ మరియు ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు&period; సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైబర్ మోసాలకు తక్షణ స్పందన&comma; బాధితులకు త్వరగా సహాయం అందించే విధానాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు&period; ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడి మోసాలు అత్యంత పెద్ద ఆర్థిక నేరాలుగా మారుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు&period; ఇప్పటి వరకు ఏపీలో సైబర్&comma; ఆర్థిక నేరాల కారణంగా ప్రజలు రూ&period;652 కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలిపారు&period; ఈ నేపథ్యంలో బాధితుల నుంచి 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు మొత్తం 9&period;29 లక్షల కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు&period; సమీక్షలో ముఖ్యంగా &OpenCurlyDoubleQuote;గోల్డెన్ అవర్” విధానం&comma; ఏపీ సైబర్ పాలసీ&comma; ఇతరుల బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చ జరిగింది&period; ఫిషింగ్&comma; విషింగ్&comma; క్రెడిట్-డెబిట్ కార్డు మోసాలు&comma; ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్&comma; డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలు భారీగా మోసపోతున్నారని అధికారులు వివరించారు&period; అయితే సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం బ్యాంకర్లతో కలిసి పనిచేయడం వల్ల రూ&period;116 కోట్లకు పైగా మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడకుండా కాపాడగలిగామని అధికారులు తెలిపారు&period; బ్యాంకులతో మరింత సమన్వయం పెంచుకుని సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..