కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు.

కోనసీమ జిల్లాలో ప్రజలకు ఇబ్బందిగా మారిన వంతెన పనులు

Advertisements

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దిండి-చించినాడ మధ్య వశిష్ఠ గోదావరిపై ఉన్న వంతెన మరమ్మత్తు పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి&period; గోదావరిపై ఉన్న వంతెనకు గత సుమారు పది నెలలుగా మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి&period;మరో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ రోడ్లు&comma; భవనాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు&period; భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు&period;అయితే నెలల తరబడి కొనసాగుతున్న మరమ్మత్తు పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; ఉద్యోగులు&comma; వ్యాపారులు&comma; విద్యార్థులు ప్రతిరోజూ ట్రాఫిక్ అంతరాయాలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు&comma; అత్యవసర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు&period;మరమ్మత్తు పనులను వేగవంతంగా పూర్తి చేసి వంతెనను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం&comma; సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.