గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఏటీసీ భవనం.

గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఏటీసీ భవనం

Advertisements

<p>కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి&period; 77 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు&period; అంతకుముందు ఏటీసీ ఆవరణలో మొక్కలు నాటారు&period;విజయవాడ ఎయిర్‌పోర్టులో 77 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఏటీసీ భవనాన్ని నిర్మించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు&period;కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ విమానాశ్రయాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు&period; టెర్మినల్ భవనం&comma; ఏవియేషన్ రంగ అభివృద్ధిలో భాగంగా ఏటీసీ భవనం కీలకమని పేర్కొన్నారు&period;ఫ్లైట్ల రాకపోకలు&comma; సిగ్నల్స్ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు&period; గతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల నుంచే కార్యకలాపాలు సాగేవని&period;&period; విమానాల సంఖ్య&comma; రద్దీ పెరగడంతో కొత్త భవనం అవసరమైందన్నారు&period; విజయవాడ ఎయిర్‌పోర్టును రాజధాని ప్రాంతానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని&period;&period; రాబోయే మూడు నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.