ఇవాళ ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Advertisements

<p>ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు&period; ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&comma; కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు&period; విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు&period; విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1à°µ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది&period; ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళుతున్నారు&period; ఈ మేరకు ప్రధానితో భేటీ అయి&comma; ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరనున్నారు&period; ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు&period; వీరితో పాటు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్&comma; మనోహర్ లాల్ ఖట్టర్&comma; సీఆర్ పాటిల్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది&period; రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీల్లో చర్చించే వీలుందని భావిస్తున్నారు&period; సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం&&num;8230&semi; ఉదయం 7&period;30 కి అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు&period; రోజంతా అధికారిక సమావేశాల్లో పాల్గొని&comma; రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు&period; పర్యటన ముగించుకుని రేపు ఏపీకి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.