నెల్లూరు అపోలో సెంటర్‌లో బీజేపీ జెండాపై స్వల్ప ఉద్రిక్తత.

Advertisements

<p>నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్‌లో సీఐటీయూ ఆటోస్టాండ్ వద్ద బీజేపీ జెండా ఏర్పాటు వివాదానికి దారితీసింది&period; సీఐటీయూ ఆటోస్టాండ్‌లో బీజేపీ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించడంతో సీఐటీయూ&comma; సీపీఎం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు&period; దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; బీజేపీ నేతల తీరుపై సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ&comma; ఆటోస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు&period; సమాచారం అందుకున్న ఆరో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు&period; ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.