రాజాంలో నాలుగు కిలోలకుపైగా గంజాయి స్వాధీనం.

Advertisements

<p>విజయనగరం జిల్లా రాజాంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది&period; చీకటిపేట జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటర్‌ను తనిఖీ చేసిన పోలీసులు&comma; స్కూల్ బ్యాగ్‌లో దాచిన 4 కిలోల 41 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు&period; వారి విచారణలో లభించిన సమాచారంతో శ్యాంపురం రోడ్డులోని మామిడి తోటలో గంజాయి సేవిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు స్కూటర్&comma; మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు&period; నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ à°¡à°¿&period; నవీన్ కుమార్ తెలిపారు&period; గంజాయి రవాణా&comma; విక్రయం&comma; వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.