యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

Advertisements

<p>మంత్రి నారా లోకేష్ à°¤‌à°¨‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాడు&period; ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా&comma; నంద‌మూరి కుటుంబ‌à°¸‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు&period; ఈ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషనల్ టీజ‌ర్‌లో మంత్రి నారా లోకేశ్‌ కూడా కొడుకుతో కలిసి సందడి చేశారు&period; ప్రమోషనల్ వీడియోలో దేవాన్ష్ ప్రారంభించబోతున్న పాడ్‌కాస్ట్‌ ప్రత్యేక‌à°¤‌à°²‌ను లోకేశ్‌ అడిగి తెలుసుకున్నారు&period; డైనోసార్లు&comma; శిలాజాలు&comma; పురాత‌à°¨ అవ‌శేషాల గురించిన ఆశ్చర్యకరమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా దేవాన్ష్ పంచుకోనున్నాడు&period; నారా దేవాన్ష్ యూట్యూబ్ ఎంట్రీపై తల్లి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో స్పందించారు&period; శిలాజాలతో నిండిన గది నుంచి దేవాన్ష్ మైక్ ముందుకు రావడం ఎంతో గర్వంగా ఉందని బ్రాహ్మణి పేర్కొన్నారు&period; తమ చిన్నారి క్రియేటర్ లాంచ్ చేస్తున్న పాడ్‌కాస్ట్‌ను చూడాలని విజ్ఞప్తి చేశారు&period; ఈ ఛానల్ మొదటి ఎపిసోడ్ శుక్రవారం విడుదల కానున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>నానమ్మ నారా భువనేశ్వరి కూడా మనవడి కొత్త ప్రయత్నాన్ని అభినందించారు&period; చిన్నారి దేవాన్ష్ ఇలా పాడ్‌కాస్ట్ రంగంలోకి అడుగుపెట్టడం చూసి తాను ఆశ్చర్యంతో పాటు ఎంతో ఉద్వేగానికి లోనయ్యానని చెప్పారు&period; తనకు ఇష్టమైన డైనోసార్ల టాపిక్‌ను దేవాన్ష్ ఎంతో ఆత్మవిశ్వాసంతో వివరిస్తుంటే తన హృదయం గర్వంతో నిండిపోయిందన్నారు నారా భువనేశ్వరి&period;<&sol;p>&NewLine;<p>దేవాన్ష్ తండ్రి నారా లోకేశ్‌ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు&period; ఉదయం నిద్ర లేవగానే తనకు కాస్త గందరగోళం కలిగిందని పేర్కొన్నారు&period; గది నిండా డైనోసార్ పుస్తకాలు&comma; డైనోసార్ పెయింటింగ్స్&comma; బొమ్మలు కనిపించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదన్నారు&period; ఆ తర్వాతే డైనోసార్లపై దేవాన్ష్ సొంతంగా పాడ్‌కాస్ట్ చేస్తున్న విషయాన్ని తనకు చెప్పాడని వివరించారు&period; పిల్లలు ఎప్పుడూ ఊహించని విధంగా సర్‌ప్రైజ్‌ ఇస్తుంటారని సంతోషం వ్యక్తం చేశారు&period; దేవాన్ష్ సృష్టించిన ఈ ప్రాచీన ప్రపంచంలోకి ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆస‌క్తిగా ఉన్నానని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..