పిఠాపురం నియోజకవర్గంలో భారీ కౌలు భూ మోసం…

పిఠాపురం నియోజకవర్గంలో భారీ కౌలు భూ మోసం

Advertisements

<p>పిఠాపురం నియోజకవర్గంలోని జల్లూరు&comma; మల్లం గ్రామాలకు చెందిన చిన్న&comma; సన్నకారు కౌలు రైతులు భారీ<br &sol;>&NewLine;మోసానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; రైతు బత్తిన రామ్మూర్తి కుమారుడు బత్తిన పద్మరాజు కౌలు భూముల పేరుతో పలువురు రైతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు&period; రైతుల కథనం ప్రకారం&comma; ఒకే భూమిని పలువురికి కౌలుకు ఇస్తూ&comma; ఒక్కో రైతు నుంచి రూ&period;2&period;50 లక్షల నుంచి రూ&period;3 లక్షల వరకు శిస్తు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు&period; ఇలా సుమారు రూ&period;2&period;5 కోట్లకు పైగా సొమ్ము సేకరించి&comma; అనంతరం మల్లం గ్రామాన్ని విడిచి కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం ప్రాంతానికి మకాం మార్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి&period;<br &sol;>&NewLine;విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మోసపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు&period; తమ పిల్లల చదువులు&comma; పెళ్లిళ్లు&comma; కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమవుతున్నారు&period; పద్మరాజు ఆచూకీ కోసం రెండేళ్లుగా వెతికిన తర్వాత సర్పవరం ప్రాంతంలో అతని నివాసాన్ని గుర్తించిన రైతులు అక్కడికి వెళ్లి నిలదీయగా&comma; తమపైనే కేసులు పెడతానంటూ బెదిరించాడని ఆరోపిస్తున్నారు&period; దీంతో ఆగ్రహానికి గురైన సుమారు 50 మంది కౌలు రైతులు పద్మరాజుకు సంబంధించిన పొలంలోనే వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు&period; తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; మోసానికి గురైన రైతులకు న్యాయం చేయాలని&comma; బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ను రైతులు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.