తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి …

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

Advertisements

<p>అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని&comma; కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period; రాష్ట్ర 12à°µ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం&period;&period; పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం మాట్లాడారు&period; నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన సీఎం&period;&period; రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులు&comma; అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు&period; తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు&comma; కృషి చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు&period; పుట్టుకనీది&comma; చావునీది&period;&period; బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలను గుర్తు చేసుకున్నారు&period; కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్ర హితం కోసమే శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు&period; సంక్షేమం&comma; అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది&period; పేదలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయాలని నిర్ణయించాం&period; 13 నెలల కాలంలో 1&period;25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాం&period; రూ&period;22 వేల కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం&period; ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3&period;50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం&period; ఈసారి క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం&period; పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం&period;’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు&period; ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు&period;<&sol;p>&NewLine;<p>గత పదేళ్ల తెలంగాణ ప్రయాణాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి&comma; ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు&period; రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు&period;అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ&comma; వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు&period; ప్రజల సహకారంతో సుస్థిర అభివృద్ధి&comma; పారదర్శక పాలన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు&period; ప్రతి పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు&period; వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న పెద్దలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు&comma; వారి ఆరోగ్యం&comma; భద్రత&comma; సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు&period;సమాజానికి సేవ చేసిన పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు&period; వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందని స్పష్టం చేశారు&period; ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు అండగా నిలవడంతో పాటు&comma; వారికి అవసరమైన అన్ని సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.