ఏపీఎస్ఈబి ఇంజనీర్స్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ…

APSEB Engineers New Year Diary Launched

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ని విజయవాడలో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు&period; విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ శైలేంద్ర కుమార్ దుబే పాల్గొనగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు 2024 డైరీ ని ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు మాట్లాడుతూ 2022వ సంవత్సరానికి సంబంధించిన వేతన సవరణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్ ఇంజనీర్స్ కు తీవ్ర అన్యాయం జరిగిందని&comma; విద్యుత్ మేనేజ్మెంట్ లోపభూయిష్టమైన విధానాలతో ఇంజనీర్లకు వేతన సవరణలో అలసత్వం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల డిమాండ్లపై విద్యుత్తు శాఖ మేనేజ్మెంట్ తో చర్చించి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు&period; పిఆర్సి లో పవర్ ఇంజనీర్లకు జరిగిన అన్యాయం పై ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సంఘాలు మద్దతు తెలిపాయని&comma; మేనేజ్మెంట్ మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు&period; వెంటనే వేతన సవరణ నెరవేర్చాలని కోరారు&period; ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంగం రాష్ట్ర అధ్యక్షులు జి బి శ్రీనివాసరావు&comma; ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి&comma; గౌరవ అధ్యక్షుడు నాగ ప్రసాద్&comma; రత్నాలరావు పలువురు పాల్గోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..