రథసప్తమి రోజు భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లూ పకడ్బంధీగా చేయాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ, నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అప్పుడే వేడుకలలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించాలి అని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి రథసప్తమికి భక్తులు అరసవల్లి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు.
రథసప్తమికి పకడ్బంధీగా ఏర్పాట్లు..
101
previous post