బస్సు డ్రైవర్‌పై దాడి…

TSRTC bus driver attacked

Advertisements

&NewLine;<p>టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు&period; సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఓ బైకర్… ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు&period; ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు&period; నిబద్ధత&comma; క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమంజసం కాదు&period; మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది&period; అయినా చాలా ఓపిక&comma; సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు&period; ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి&period; సంగారెడ్డి జిల్లా ఆందోల్‌‌లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన సంఘటన బైకర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ప్రమాదానికి కారణమయ్యాడు&period; అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టీఎస్ఆర్టీసీ హైర్‌ బస్‌ డ్రైవర్‌పై దాడి చేశారు&period; దుర్భాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు&period; ఇలాంటి దాడులను యాజమాన్యం అసలు సహించదు&period; ఈ ఘటనపై ఆందోల్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయడం జరిగింది&period; ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి… పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period; ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అని ఆయన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..