ప్రజాగళం సభ (Prajagalam Sabha) :
టీడీపీ అధినేత చంద్రబాబు గాజువాక ప్రజాగళం సభ (Prajagalam Sabha)లో ప్రసంగిస్తుండగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్రజాగళం వాహనం వెనుక వైపు నుంచి చంద్రబాబుపైకి రాయి విసిరి పారిపోయాడు. రాయి విసిరిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ పై చీకట్లో గులకరాయి పడిందని, తనపై కరెంటు ఉన్నప్పుడే రాయి పడిందని అన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇది చదవండి : సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత…
విజయవాడలో జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా అని హెచ్చరించారు. తెనాలిలో పవన్ కల్యాణ్ పై కూడా చేతకాని పిరికిపందలు రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలప్పుడు నాపై కూడా రాళ్లు వేశారు అని చంద్రబాబు వెల్లడించారు. జగన్ సభ సమయంలో కరెంట్ పోయింది… సీఎం సభలో కరెంట్ పోతే ఎవరు బాధ్యత వహించాలి? జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. కాగా, రాయి పడడంతో చంద్రబాబు ప్రసంగం ఆపారు. వాళ్లు దొరికితే తరిమి తరిమి కొడతారు అంటూ హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చంద్రబాబు పై రాళ్ళ దాడి…