ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై దాడి (Attack on Jagan) రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు దాడ్ని తీవ్రంగా ఖండిచాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదుష్టికరమని పలువురు నేతలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. మరొవైపు అధికార పార్టీ నేతలు… ప్రతిపక్ష పార్టీపైన, ప్రతిపక్ష పార్టీ నేతలు అధికార పార్టీపైన విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి భద్రత కల్పించాల్సిన అధికారులు ఏమి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చెప్పట్టారు. యాత్ర చేపట్టి నేటికి 15 రోజులవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యాటిస్తున్న సీఎంకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ విజయవాడ బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. విజయవాడలో ‘మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా జగన్‌పై దాడి ఘటన జరిగింది. ఘటనలో జగన్ కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్‌లోని గంగానమ్మ గుడి దగ్గర, వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సయమంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది.
సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసకు రాయి తగిలి కంటికి స్వల్ప గాయమైంది. ముఖ్యమంత్రికి బస్సులోనే వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాత్రి యాత్ర ముగిసిన తర్వాత.. ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం మళ్లీ కేసరపల్లిలోని శిబిరానికి చేరుకున్నారు. “జగన్ నుదుటిపై తాగిలిన గాయానికి వైద్యులు రెండు కుట్లు వేశారు. గాయం పెద్ద తీవ్రమైనది కాదని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఇది చదవండి: నేడు సీఎం జగన్ యాత్రకు విరామం..!
ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిలో పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రథమ పౌరుడు, అత్యంత ప్రముఖమైన వ్యక్తి అయిన జగన్‌కు భద్రత విషయంలో అనేక జాగ్రత్తులు తీసుకోవాలి. ఎంతో పెద్దయెత్తున సెక్యూరిటీ కల్పించాలి. సెక్యూరిటీ పరంగా ఆయనకూ….. ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఎం సెక్యూరిటీ గ్రూపు , క్లోజ్ ప్రాక్సిమిటీ గ్రూప్, ఎస్కార్ట్, ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, పెరిఫెరీ ఇలా వందల మందితో భద్రత కల్పిస్తారు. వీళ్ళు కాకుండా ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు సైతం కల్పించే భద్రత అదనం. అయినా సీఎంపైకి రాయి విసిరి, గాయం చేయగలిగారంటే.. భద్రతాపరంగా పోలీసులు ఎంత ఘోరంగా విఫలమయ్యారో ఈ ఘటన దర్పణం పడుతుంది.
దాడి జరిగిన ప్రాంతానికి పోలీసుస్టేషన్ కేవలం 2 కిలోమీటర్లు, సీపీ అఫీసు 8 కిలోమీటర్లు, డీజీపీ ఆఫీసు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. సీఎంపై జరగిన దాడి తీరు చూస్తే ప్రొటోకాల్ పరంగా ఘోర భద్రతా వైపల్యంగా భావిస్తున్నారు. ప్రొటోకాల్స్ ప్రకారం… సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంటే ఆ ప్రాంతంలో విద్యుత్తు కోత, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ముందే చూసుకుంటారు. కానీ ఆ ప్రాంతంలో సీఎంపై దాడి జరిగే కొద్ది సేపటి ముందే ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. సీఎంతో పాటు ఆయన పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కు రాయి తగిలి స్వల్ప గాయమైంది. ముఖ్యమంత్రిని భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ బస్సు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి….. కానీ అందుకు విరుద్ధంగా సీఎం బస్సు మీద నిలబడటానికి సీఎంఎసీ ఎలా అనుమతించింది అనేది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది.
ఇది చదవండి: జగన్ పై దాడిని ఖండిస్తూ అంబటి రాంబాబు
ఒకవేళ విద్యుత్ సరఫరా లేకపోతే ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ వేయాలి…. కానీ భద్రతా సిబ్బంది అవేవి చేయలేదు. ముఖ్యమంత్రి కదిలే సమయంలో అంతర్గత బందోబస్తు, బయట, చుట్టుపక్కల బందోబస్తు ఉండాలి. జగన్ పైకి రాయి రువ్వినప్పుడు వారు ఎందుకు గమనించలేదు… ఎందుకు అడ్డుకోలేదు… ఆ సయమంలో వారు ఏం చేస్తున్నారు… ముఖ్యమంత్రి బస్సును చుట్టుముట్టి నిరంతరం గమనించాల్సిన స్పెషల్ బ్రాంచ్ నిఘా విభాగం ఎక్కడి పోయింది ఇలా పలు సందేహాలు, అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎవరైనా దుండగులు రాళ్లు విసురుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గమనించలేదు.
ముఖ్యమంత్రికి రాయి తగిలిన సమయంలో సీఎంఎసీజీ ఎందుకు వంగి మోకాళ్లపై నిలబడారు… విద్యుత్తు కోత సమయంలో సీఎం చుట్టూ రాళ్ల వంటివి పడకుండా స్టోన్ గార్డులు ఎందుకు ఏర్పాట చేయలేదు అని పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాయి దాడి కంటే ముందు అనంతపురంలో ముఖ్యమంత్రిపై చెప్పులు విసిరన ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాతైనా సీఎం సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోర భద్రతా వైఫల్యానికి కారణం నిగ్గు తేలాలంటే సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది.
ఇది చదవండి: టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం..
గత ఎన్నికల సమయంలో కోడికత్తి, గొడలి వేటు డ్రామా ఆడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో డ్రామాకు తెరలేపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికలో ఓటమి భయంతోనే రాయి దాడి డ్రామాలడుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. బస్సు యాత్ర ద్వారా జగన్‌కు వస్తున్న ప్రజాదరణకు ఓర్వలేకనే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు జగన్‌పై కుట్రలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.