హత్యాయత్నం (Attempted murder):
కర్నూలు నగరంలో నిన్న రాత్రి బావమరుదుల పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రోజా వీధికి చెందిన ఉప్పరి పెద్ద మూర్తి, (25) ఉప్పరి సాయి(19) రాత్రి ఆటోలో గ్రంథాలయం వైపు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి దుండగులు పరారైయ్యారు. భాదితులను ఆసుపత్రికి తరలించగా బావమరిది ఉప్పరిసాయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెద్ద మూర్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.