సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు. రాయచోటి పట్టణం నందు 23 కోట్లతో తుది దశకు చేరుకున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ను ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ కార్తీక్ లతో కలిసి వారు ఆసుపత్రి ప్రాంగణంలోని రోడ్లను భవన నిర్మాణాలను పరిశీలించి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన గదులతో పాటు ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్, ల్యాబ్, రిసెప్షన్ లను కూడా పరిశీలించారు. 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పనులను, నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఎపి సిఎం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజున ప్రారంభం చేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పెట్టుకొన్నారన్నారు. అయితే ఇంజినీరింగ్, గుత్తేదారులు ఒక వారం సమయం ఇచ్చినట్లయితే నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమకు తెలియజేసారాన్నరు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతనే వారి నిర్ణయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. వారి వెంట ప్రోగ్రాం డైరెక్టర్ సాయి, వైకాపా నాయకులు అన్నా సలీం, బేపారి జబి బుల్లా ఖాన్ పాల్గొన్నారు.
త్వరలో అందుబాటులోకి….
59
previous post