కందుకూరు పట్టణం 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు. బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా, విక్కిరాలపేట రోడ్డు, ప్రతిభ డిగ్రీ కాలేజీ ప్రాంతాల్లో ముస్లింల ఇళ్లకు వెళ్లి పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు ఆప్యాయంగా నాగేశ్వరరావు ని ఇంటికి ఆహ్వానించి, ఈ ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు, స్థానిక సమస్యల గురించి చెప్పుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని, మైనారిటీ కుటుంబాల అభివృద్ధే లక్ష్యంగా దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, ఇమామ్, మౌజంలకు జీతాలు… ఇంకా అనేక పథకాలు అమలు చేశారని నాగేశ్వరరావు వారికి గుర్తు చేశారు. ముస్లిం సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకుగా చూడడం, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు నిలిపివేయటం తప్ప ఏమి చేయలేదని నాగేశ్వరరావు విమర్శించారు. వైసిపి పాలనలో రాజధాని లేకుండా చేసిన విషయాన్ని, జగన్ ఉత్తుత్తి హామీలను గుర్తు చేస్తూ, ఈ నాలుగున్నరేళ్లలో పెరిగిన ధరలు,పెంచిన చార్జీలు, పన్నుల గురించి ముస్లిం మహిళలకు వివరించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, కందుకూరు పట్టణంలో ముస్లింలకు ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో అంకెలతో సహా ఆయన వివరించారు.
రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే.. తల్లికి వందనం, ఆడబిడ్డనిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైతులకు ఆర్థిక సహాయం, బీసీలకు రక్షణ చట్టం పథకాల గురించి చెబుతూ, ప్రతి ఇంటికి అందించబోయే లబ్దిపై హామీ ఇస్తూ, షూరిటీ బాండ్లను నాగేశ్వరరావు అందజేశారు. 7వ వార్డులో నాలుగు నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువ అప్పుడే దెబ్బతిన్న విషయాన్ని స్థానికులు తెలపగా నాగేశ్వరరావు పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నాణ్యత లేకుండా ఇంత దారుణంగా పనులు చేస్తుంటే, ఎమ్మెల్యే నిద్రపోతున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు నాసిరకంగా పనులు చేయడం, మున్సిపల్ కమిషనర్ వారికి వత్తాసు పలుకుతూ బిల్లులు చేయడం చూస్తుంటే… అందరూ కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తనను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి, రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు. రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తోటివారికి వివరించి, ఈసారి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా చూడాలని నాగేశ్వరరావు కోరారు. అనంతరం పార్టీ నాయకుడు యూనస్ ఇంట్లో జరిగిన దువా కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొనగా, మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు గౌస్ బాషా, రూబీ, ఖాదర్ బాషా, ఖలీల్, యూనిస్, వహీద్, జమీర్, ఖలీల్, బాషావలి, అస్మత్ భాయ్, ఖుద్దుస్, ఫరీద్, కోటేశ్వరరావు, అల్లం వెంకటేశ్వర్లు, చల్లా వెంకటేశ్వర్లు, చంటి, జియావుద్దీన్, కరిముల్లా, ఫాజిల్, గౌస్ బాషా, మహమ్మద్ అలీ, డాక్టర్ ఖాదర్ బాషా, సలాం, ఫిరోజ్, ఖలీల్, సయ్యద్ బాబు, బాషా, సుభాని, షఫీ, వలి, ఖాదర్ వలీ, నాయబ్ రసూల్ నాయకులు చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, వడ్డేళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాదు, షేక్ మున్నా, చుండూరి శ్రీను, ముచ్చు వేణు, షేక్ షరీఫ్, ముప్పవరపు వేణు, మచ్చ మనోహర్, గుమ్మ శివ, కల్లూరి శైలజ, అశ్విని సుధారాణి, ఎస్తేరమ్మ, బత్తిన నాగేంద్ర, పొడపాటి రాధ, పార్వతి ఇతర నాయకులు పాల్గొన్నారు.