98
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా తాజాగా బాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో సార్వత్రిక ఎన్నికలలో పొత్తు విషయమై ఢిల్లీలో కీలక చర్చలు జరపనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ అంశాలతో పాటు రెండో ఉమ్మడి జాబితాలోని అభ్యర్థుల విషయమై కూడా ఇరువురు అధినేతలు కీలక మంతనాలు జరిపారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ లోనే ఉన్నారు.