తెదేపా, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నరసన్నపేట నియోజకవర్గానికి తనను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నరసన్నపేట (Narasannapeta) ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి (Baggu ramanamurthy) అన్నారు. కార్యకర్తల యొక్క దీక్ష, ఐకమత్యమే తనను ఈరోజు నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు పార్టీ పెద్దలకు తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నరసన్నపేట నియోజకవర్గం తెదేపా అభ్యర్థిత్వాన్ని ఎంతోమంది ఆశించినా, ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చిన తనకే టికెట్ కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: టెండర్ ఖరారు కాకుండానే మెటీరియల్ దిగుమతి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి