నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి (Baggu Ramanamurthy) నామినేషన్ వేశారు. సతీ సమేతంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని వేలాది మంది కార్యకర్తలతో ఊరేగింపుగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ముందుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడే నామినేషన్ వేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నరసన్నపేట ప్రజలు తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న విశ్వాసంతో వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఈరోజు జరిగిన ర్యాలీ నా భూతో నా భవిష్యత్తు అని తెలిపారు. సైకోను రాష్ట్రం నుండి పార ద్రోలాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి