Saturday, May 9, 2026
News Navigation
Saturday, May 9, 2026
News Navigation

Breaking

Saturday, May 9, 2026
Home Telangana గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..!

గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు..!

by Satya
Gutha Sukender Reddy

బీఆర్ఎస్‌(BRS)పై సొంత పార్టీ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutha Sukender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) పార్టీ పరాజయం కావడానికి.. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి ఆయా జిల్లాలకు చెందిన గత మంత్రులే కారణమని చెప్పారు. వారి అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని మండిపడ్డారు. పరిస్థితి ఇలా ఉన్నా ఇప్పటికీ సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే పార్టీ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం మానేశారని ఆరోపించారు.

ఇది చదవండి: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి…

ఒకప్పుడు జేబులో రూ. 500 కూడా లేని నేతలు ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతులయ్యారని పేర్కొన్నారు. ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. జిల్లాకు చెందిన నేతలు కొందరు తాను కేసీఆర్‌ను కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అప్పట్లో తనను 16సార్లు కలిసి, మంత్రి మండలిలోకి తీసుకుంటానని హామీ ఇచ్చాకే పార్టీ మారానని గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి ఆసక్తి చూపిస్తే కొందరు జిల్లాకు చెందిన కొందరు నేతలు సహకరించలేదని, అందుకనే పోటీనుంచి తప్పుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

010941
Total views : 70906

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.