వైసిపి పాలనలో నష్టపోయింది బీసీలే..

TDP BC

Advertisements

&NewLine;<p>ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై&comma; నెల్లూరు జిల్లా టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు&period; వైసిపి పరిపాలనలో ఎక్కువగా నష్టపోయింది బీసీ లేనని&comma; వారంతా ఐకమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సత్తా ఏమిటో చూపాలని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు&period; దానికి సంబంధించి బీసీలను సమాయత్తం చేసేందుకు&comma; కందుకూరులోని పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు&period; మీడియా సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలహీనవర్గాలపై అధిక సంఖ్యలో దాడులు జరిగాయని&comma; ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నామని గుర్తు చేశారు&period; బీసీ లను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని&comma; సామాజిక బస్సుయాత్ర పేరుతో మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు&period; జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో నష్టపోని కుటుంబమే లేదని&comma; రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఐకమత్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని నాగేశ్వరరావు కోరారు&period; కందుకూరు నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్&comma; మాలకొండ దేవస్థానం చైర్మన్ పదవుల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని నాగేశ్వరరావు తెలిపారు&period; ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు&period; నెల్లూరులో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు&comma; అఖిలపక్ష నేతలు హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..