రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌….

Bhajanlal Sharma

Advertisements

&NewLine;<p>రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది&period; ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది&period; బీజేపీ శాసనసభాపక్ష నేతగా భజన్‌లాల్‌ శర్మను సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు&period; భజన్‌లాల్‌ తొలిసారి సీఎంగా ఎన్నికయ్యారు&period; డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి&comma; ప్రేమచంద్‌ భైరవను బీజేపీ ప్రకటించింది&period; అదే విధంగా స్పీకర్‌ వాసుదేవ్‌ దేవ్‌ నాని ఎంపిక చేసింది&period; కేంద్ర మంత్రి రాజనాథ్‌ సింగ్‌&comma; బీజేపీ పరిశీలకులు రాజస్థాన్‌ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు&period; బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్‌ శర్మ పేరును రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు&period; ఇక రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే&comma; దియాకుమారి&comma; అర్జున్‌రామ్‌&comma; గజేంద్ర షెకావత్‌&comma; అశ్విని వైష్ణవ్‌ లాంటి సీనియర్ల పేర్లు వినిపించాయి&period; తీవ్ర సస్పెన్స్‌ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం&period;&period; చివరి నిమిషంలో భజన్‌లాల్‌ పేరును తెరపైకి తెచ్చింది&period; చివరకు ఛత్తీస్‌గఢ్‌&comma; మధ్యప్రదేశ్‌ తరహాలోనే రాజస్థాన్‌ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది&period; 56 ఏళ్ల భజన్ లాల్‌ శర్మ&period;&period; పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు&period; భజన్‌ లాల్‌ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు&period; సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48&comma;081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.