ప్రజాభవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఉప ముఖ్యమంత్రి&comma; ఆర్థిక&comma; విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం &OpenCurlyQuote;మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్’లోకి అడుగుపెట్టారు&period; ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు&period; ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు&period; కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు&period; పూజా కార్యక్రమాల్లో భట్టి భార్య&comma; ఇతర కుటుంబ సభ్యులు&comma; ఆయన అనుచరులు&comma; కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది&period; అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది&period; అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది&period; అందుకే గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.