తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణంలో ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసిపికి, కూటమి అభ్యర్థి మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతుంది. నిన్న జరిగిన ఘటనపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరని శ్రీనివాసులు వ్యవహార శైలిపై టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుది హత్యా రాజకీయాల నేపథ్యం ఉన్న వ్యక్తి అని,.. ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలను కుంటే తస్మాత్ జాగ్రత్త ఆరణి శ్రీనివాసులు అంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలను తిరుపతి ఎన్నటికీ అంగీకరించదని, ఇలా వ్యవహరించే వారిని తిరుపతి తుడిచి పెట్టేసింది అని అన్నారు. చిత్తూరులో హత్యారాజకీయ సంప్రదాయంలో పెరిగిన కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు అంటూ ఘాటుగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రశాంతతకు నిలయమైన తిరుపతి లో అలజడులు సృష్టించేందుకు, గూండాగిరితో చేయాలని చూస్తున్న వ్యక్తి శ్రీనివాసులు అని, ఈ వ్యక్తి తిరుపతి లో అల్లర్లు లేకుండా చేస్తాడంట.. పవిత్రతను కాపాడుతాడంట.. శ్రీనివాసులు ఇంకా చాలా చాలా సుద్ధులు మాట్లాడం ఆపు అంటూ హెచ్చరించారు. తిరుపతిలో ఎవరూ దొరక్కపోతే, చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలను తీసుకొచ్చి దాదాగిరి చేయాలని చూస్తున్నాడు. ఆరణి శ్రీనివాసులు పత్రికల ద్వారా సుద్ధులు చెప్పడం కాదు.. తిరుపతి ప్రజలు చాలా మంచి వారు కాబట్టి ఓటుతో నీకు తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరించారు. నీ బతుకే, నీ నేపథ్యమే హత్యా రాజకీయాల నేపథ్యం…నువ్వేంది, కాపాడేదేంది…? చిత్తూరులో ఉన్న సంస్కృతిని తిరపతికి తెస్తూ, మా అరాచకాన్ని ఆపుతానంటావా..? మేము చేస్తున్న మంచిని తుడిచేయాలని, మేము చేసే సేవలు ప్రజలకు అందకుండా చేయాలననే హింసా నేపథ్యంతో ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు అన్నారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతిలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…