కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు

Biden

Advertisements

&NewLine;<p>యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు&period; అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్&comma; పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు&period; గాజా నుంచి పాలస్తీనావాసులను బలవంతంగా పంపించకూడదని ఇజ్రాయెల్‌కు బైడెన్ సూచించారు&period; గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమణలు చేయకూడదని తేల్చి చెప్పారు&period; &OpenCurlyQuote;ది వాషింగ్టన్‌ పోస్టు’కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు&period; వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెలీ అతివాదులకు అమెరికా వీసాలను ఇవ్వబోమని బైడెన్‌ వార్నింగ్ ఇచ్చారు&period; సాధారణ పౌరులను ఇబ్బందిపెడుతున్న ఇలాంటి వారిని గుర్తించి&comma; తగిన మూల్యం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌ను బైడెన్‌ కోరారు&period; దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఇంకోలా ఉంది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;పాలస్తీనా అథారిటీకి గాజాను పాలించే సామర్థ్యం లేదు అనీ యావత్ గాజా సైనిక రక్షణ బాధ్యతలను ఇజ్రాయెల్‌ చూస్తుందన్నారు&period; పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌ ఏరియాలో సైన్యం దాడులు&comma; ఇజ్రాయెలీ సెటిలర్ల హింస కారణంగా గత రెండు వారాల్లో 200 మంది పాలస్తీనియన్లు చనిపోయిన నేపథ్యంలో బైడెన్ పై ప్రకటనను విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..