ఏపీలో వైసీపీకి భారీ షాక్..!

Big shock for YCP in AP

Advertisements

&NewLine;<p>ఏపీలో వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది&period; నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు&period; లోక్ సభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు&period; అయితే ఏ పార్టీ చేరబోతున్నారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు&period; శ్రీకృష్ణ దేవరాయలును నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం సూచించిన సంగతి తెలిసిందే&period; అయితే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదు&period; రాజీనామా చేసిన సందర్భంగా లావు మాట్లాడుతూ పార్టీలో గత 15&comma; 20 రోజులుగా అనిశ్చితి నెలకొందని చెప్పారు&period; అనిశ్చితికి తెర పడాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశానని చెప్పారు&period; అనిశ్చితికి తాను కారణం కాదని&comma; ఈ అనిశ్చితిని తాను కోరుకోలేదని అన్నారు&period; ఈ అనిశ్చితి వల్ల తనకు కానీ&comma; పార్టీకి కానీ ఉపయోగం లేదని చెప్పారు&period; క్యాడర్ కూడా ఏ డైరెక్షన్ లో వెళ్లాలనే గందరగోళంలో ఉన్నారని తెలిపారు&period; దీనికి పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పారు&period; పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే తాను రాజీనామా చేశానని చెప్పారు&period; గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఎంతో సేవ చేశానని తెలిపారు&period; అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని చెప్పారు&period; దీని వల్ల అందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని తెలిపారు&period; దీనికి తెరదించుతూ తాను ఎంపీ పదవికి&comma; పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు&period; ముఖ్యమంత్రి జగన్ తనను ప్రోత్సహించి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆయన ఆకాంక్షల మేరకు తాను పార్టీని ఉన్నత స్థాయిలో ఉంచానని తెలిపారు&period; ఎంపీ అంటే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి కనిపిస్తాడనే భావనను తాను తొలగించానని ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలా అండగా ఉన్నానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..