విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సుజనా చౌదరికి మద్దతుగా వైసీపీ 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ కుమార్ బీజేపీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బుల్లా విజయ్ కుమార్ వందలాది మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలని, ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్ అని సుజనా చౌదరి అన్నారు దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్ వంటి నాయకులు బీజేపీలో చేరడం మరింత బలం చేకూరుస్తుందనే నమ్మకం తమకుందని అన్నారు. ఓటర్లు 13వ తేదీ ఉదయం ఆరు గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, 75శాతానికిపైగా పోలింగ్ జరిగేలా ఓట్లేయాలని ప్రజలను సుజనా కోరారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చవాకులు పేలితే వైసీపీ నేతల తాట తీస్తా-విజయ్ కుమార్
సీనియర్లకు వైసీపీలో గుర్తింపు లేదని విజయ్ కుమార్ ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తాను ఎన్నో అవమానాలను భరించానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన తనపై ఎవరైనా తనపై అవాకులు చవాకులు పేలితే తాట తీస్తానని విజయ్ కుమార్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ చేరిక నియోజక వర్గానికి నూతన అధ్యాయాన్ని సృష్టి స్తుందనే నమ్మకం తమకు ఉందని టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు. బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, యేదుపాటి రామయ్య, రజనీ, మోబిన్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…